మహిళల భద్రత కోసం సాగిన నారీ శక్తి అవగాహన
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అక్కుపల్లి రోడ్డులో కాశీబుగ్గ పోలీసులు నారీ శక్తి అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళల రక్షణ మరియు సోషల్ మీడియా వేధింపులపై స్థానిక ప్రజలు, యువకులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ఈవ్ టీజింగ్‌కు గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 కు, బాల్య వివాహాల నిరోధానికి 1098 కు కాల్ చేయాలని పోలీసులు హెచ్చరించారు.