విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోసారి భారీ ప్రమాదం
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్లోని ఎస్ఎంఎస్-1 సీసీడీ విభాగంలో సాంకేతిక లోపంతో ల్యాడిల్ స్లెడ్ గేట్ సరిగ్గా మూతపడలేదు. దీంతో అధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవ రూప ఉక్కు క్యూలైన్ ప్రాంతంలో కిందికి ఒలికింది. తీవ్ర వేడితో ఉక్కుద్రవం ప్రవహించడంతో కార్మికులు భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అప్రమత్తమవ్వడంతో ప్రాణనష్టం తప్పిందని, భద్రతా ప్రమాణాలు పాటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.