తాగునీటి సమస్యపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి: ముఖ్యమంత్రి
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గిద్దలూరు, కనిగిరి ప్రాంతాలకు నల్లమలసాగర్ నుంచి నీటిని తరలించాలని స్పష్టం చేశారు. మదనపల్లె, పుంగనూరు, కుప్పంలలో చెరువులను హంద్రీ-నీవా నీటితో నింపాలని, పశుగ్రాస కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. కరవు పనులు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.