జనగాం జిల్లాలో వ్యవసాయ మరియు ఉద్యాన ఉత్పత్తులపై అవగాహన సదస్సు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జనగాం

జనగాం జిల్లా కేంద్రంలో వ్యవసాయ మరియు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎగుమతుల అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ రంగంలో రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.