మంత్రాలయంలో పదిహేనేళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి గండి: రసవత్తరంగా ఎన్నికల పోరు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కర్నూలు

మంత్రాలయం నియోజకవర్గంలో పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ సంప్రదాయానికి ఈసారి తెరపడిందని స్థానిక రాజకీయ వర్గాలు వెల్లడించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటుచేసుకున్న తీవ్ర వైరుధ్యాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. మండలంలోని పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను వైకాపా మూడు స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన స్థానాల్లో ముప్పై మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు.