ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఐదు వేల జరిమానా విధింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: Bengaluru

కర్ణాటకలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ కీలక ప్రకటన చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, ఫుట్పాత్లపై బైక్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాను రూ.500 నుండి ఏకంగా రూ.5,000కు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పునరావృత నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు డ్రైవింగ్ లైసెన్సుల రద్దు విధానాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా మరియు హోం శాఖల సంయుక్త సమావేశంలో స్పష్టం చేశారు.