ప్రకాశం జిల్లాలో పర్యటించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
రిపోర్టర్: అశోక్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.