కరెంట్ కోతలతో అల్లాడుతున్న లంకెలపాలెం ప్రజల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

లంకెలపాలెంలో సబ్స్టేషన్ లేకపోవడంతో నిత్యం విద్యుత్ కోతలు తీవ్రమై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు గంజి సురేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ నూతన సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టకపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని సురేష్ హెచ్చరించారు.