కృత్రిమ సూర్యుడి తయారీలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది.
రిపోర్టర్: వెంకట్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ నిపుణులు కృత్రిమ సూర్యుడి ప్రాజెక్టులో కీలక పురోగతి సాధించారు. ఎస్ఎస్టీ-1 పరికరంలో గైరోట్రాన్ డివైజ్‌ను పరిశోధకులు విజయవంతంగా ఇన్స్టాల్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా ప్లాస్మా ఉష్ణోగ్రతను కోట్లాది డిగ్రీలకు పెంచి, అణు సంలీన ప్రక్రియ ద్వారా సురక్షితంగా, అపరిమితంగా స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైంది.