'4 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం': తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వరుసగా రెండో రోజు భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉండటంతో టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం కేవలం 4 గంటల్లోనే పూర్తవుతోంది. నిన్న ఒక్కరోజే 71,196 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 22,581 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.