తమిళనాడులో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: హరి
స్థలం: తమిళనాడు
జవహర్ నవోదయ విద్యాలయాల వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ తమిళనాడులో హిందీ బోధించబోమని చెప్పడం కుదరదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల స్థాపనకు అవసరమైన స్థలాలను గుర్తించాలని స్పష్టం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం భూసేకరణ కోసం మరో మూడు నెలల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.