బైక్ ప్రియులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి రెండు కొత్త మోడళ్లను విడుదల చేసిన హోండా

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి రెండు కొత్త డ్యూయల్-స్పోర్ట్ బైక్లను విడుదల చేసినట్లు హోండా మోటార్సైకిల్ కంపెనీ ప్రకటించింది. XR300L మరియు XR300 ర్యాలీ మోడళ్ల బుకింగ్లను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. ఆఫ్-రోడ్ సెగ్మెంట్పై దృష్టి సారించి ఈ బైక్లను తీసుకువచ్చామని, ఎక్స్-షోరూమ్ ధరలను కూడా ఖరారు చేసినట్లు హోండా యాజమాన్యం స్పష్టం చేసింది.