రైతన్నలకు తీపి కబురు: రైతుబజార్లలో కిలో బియ్యం కేవలం 49 రూపాయలకే

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో నాణ్యమైన సన్నబియ్యాన్ని సబ్సిడీ ధరకే అందజేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ భవానీపురం రైతుబజార్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే అత్యంత తక్కువగా కిలో బీపీటీ బియ్యం 49 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 26 కేజీల చొప్పున సబ్సిడీ బియ్యం సాయం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు.