రాజాపేట: లక్ష్మక్కపల్లిలో మహిళ అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నారెడ్డి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల ఆరో తేదీన బావి వద్దకు వెళ్లిన భార్య కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఏడో తేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన అధికారులు ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేసి మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.