డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హాజీపూర్
మంచిర్యాల జిల్లా హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను అదనపు కలెక్టర్ వి.రాములు శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విచారణలు పూర్తయిన కేసుల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే సెలవు రోజుల్లో కూడా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం కొత్తపల్లి హామ్లెట్లో రీ-సర్వే పనులను పరిశీలించారు.