ఆంధ్రా పేపర్స్ కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతూ, రూ. 21.34 కోట్ల పన్ను ఎగ్గొడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గోదావరిని కలుషితం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ఈ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలకు సిద్ధమని స్పష్టం చేశారు. 'స్వచ్ఛ గోదావరి' కోసం పౌర సమాజం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.