అర్నబ్ తుపాను బీభత్సం: గజపతి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు

రిపోర్టర్: మహేష్ స్థలం: గజపతి

అర్నబ్ తుపాను ప్రభావంతో గజపతి జిల్లాలో రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయని కలెక్టర్ అక్షయ్ తెలిపారు. పది చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయని, నూట యాభై తొమ్మిది విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని వివరించారు. సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సూర్యవంశీ సూరజ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. కాలువలో మునిగి ప్రేమానంద్ గమాంగ్ అనే యువకుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు.