'దివంగత పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటాం': ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, వారికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.