విజయనగరం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల పద్దెనిమిది అర్జీలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం రెండు వందల పద్దెనిమిది అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట ఆరు వినతులు అందాయని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఎస్.సేధుమాధవన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు.