ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా సోషల్ ఆడిట్ నిర్వహించాలి
రిపోర్టర్: నరేష్
స్థలం: యాదాద్రి భువనగిరి
భువనగిరి జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఉండేలా ప్రతి నెలా సోషల్ ఆడిట్ నిర్వహించాలని ఇన్ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి నిఘా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ బియ్యం పంపిణీ, ఈ-కేవైసీ, రేషన్ కార్డుల వివరాలపై సమీక్ష నిర్వహించి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.