రాప్తాడు హైస్కూల్ ఘటన: పోలీసుల కాల్పుల్ లో గాయపడిన ప్రధాన నిందితుడు హేమంత్

రిపోర్టర్: గోపి స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గోపికపై దాడి చేసిన ప్రధాన నిందితుడు హేమంత్ పోలీసుల కాల్పుల్ లో తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన హేమంత్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన ఈ అరాచక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం విదితమే.