పోలీస్ డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు పది శాతం రిజర్వేషన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. నేరుగా భర్తీ చేసే పోలీస్ స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాల్లో హోంగార్డులకు పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ వర్తింపజేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్ వల్ల డ్రైవింగ్ నైపుణ్యాలు ఉండి కానిస్టేబుల్ కావాలనుకునే హోంగార్డులకు పోటీ ఒత్తిడి తగ్గి శాశ్వత ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు.