ఉద్యోగులకు రూ.కోటి ఉచిత ప్రమాద బీమా: డిప్యూటీ సీఎం భట్టి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్ల కోసం ప్రభుత్వం రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.91 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్‌కార్డులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు.