అల్పపీడన ప్రభావంతో ప్రత్తిపాడులో దంచికొడుతున్న భారీ వర్షాలు

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

అల్పపీడన ప్రభావంతో ప్రత్తిపాడు మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రధాన రోడ్లపై వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యవసాయ పొలాల్లో నీరు అధికంగా నిలిచిపోవడంతో తమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.