వంగపల్లిలో ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసిన తహశీల్దార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహశీల్దార్ గణేష్ పరిశీలించారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని, నివాసం మారిన వారు చిరునామా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీఓ అర్చన, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.