కరీంనగర్‌లో విషాదం: కూతురి అంత్యక్రియల్లోనే తల్లి మృతి

రిపోర్టర్: మహేష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా దుర్శేడులో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ శ్రీవిద్య(36) ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన తల్లి సవిత, అంత్యక్రియలు జరుగుతుండగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. గంటల వ్యవధిలో తల్లీకూతుళ్లు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.