రోలుగుంటలో రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

రిపోర్టర్: G TAMMUNAIDU స్థలం: రోలుగుంట

రోలుగుంట మండల కేంద్రంలో బి.ఎన్. రహదారి పునర్నిర్మాణ పనులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చోడవరం జనసేన ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు ఈ పనులతో పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డాది వరకు రహదారిని పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న రోలుగుంట కల్వర్టును వెంటనే పునర్నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు.