మంత్రి దీపికా పాండే కుమార్తె మృతిపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జంషెడ్పూర్
జంషెడ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా మృతి చెందడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రికి ఫోన్ చేసి పరామర్శించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.