ఓటీటీలో భారీ నష్టాన్ని చవిచూసిన యశ్ టాక్సిక్ సినిమా

రిపోర్టర్: రమేష్ స్థలం: India

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయాయి. ఒక దశలో రూ.150 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినా వదులుకున్న నిర్మాతలు, ఇప్పుడు కేవలం రూ.30 కోట్లకే జీ5 సంస్థకు డిజిటల్ హక్కులు విక్రయించాల్సి వచ్చింది. సెప్టెంబర్ చివరి వారంలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.