తుఫాన్ బాధితులకు బాసటగా నిలిచి నిత్యావసరాలు అందజేసిన అధికారులు
రిపోర్టర్: Nelluri Chiranjeevi
స్థలం: గొలుగొండ
గొలుగొండ మండలం డొంకాడ గ్రామంలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముప్ఫై రెండు మంది బాధితులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తహశీల్దార్ శ్రీనివాసరావు రేషన్ డిపో ద్వారా సరుకులు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొని బాధితులకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.