వంటనూనెలపై దిగుమతి సుంకం భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సోయాబీన్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయగా, ఇతర నూనెల పన్నులను కూడా కుదించింది. సవరించిన ఈ కొత్త రేట్లు దేశవ్యాప్తంగా రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు కేంద్రం వెల్లడించింది.