మార్చి నాటికి ఇళ్ల స్థలాల భూసేకరణ పూర్తి చేయాలి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

అమరావతి సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న 114 నిర్ణయాల్లో 57 అమలైనట్లు సీసీఎల్‌ఏ జయలక్ష్మి తెలిపారు. 2027 మార్చి నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అనర్హులైన 43,948 మంది ఇళ్ల స్థలాల కేటాయింపులను రద్దు చేసి, అర్హులకు పునఃకేటాయింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు.