దీపావళి పండుగ వేళ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దాసు బాలాజీ పిలుపు

రిపోర్టర్: Balaji స్థలం: పిచ్చాటూరు

దీపావళి పండుగను పురస్కరించుకుని హనుమంతపురం గ్రామానికి చెందిన దాసు బాలాజీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టపాసులు కాల్చేటప్పుడు పిల్లల భద్రతకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.