తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

తిరుమలలో ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు తొలి రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ 19న ప్రధాన గరుడ సేవ జరగనుండగా, సెప్టెంబర్ 26న పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.