మలబద్ధకంతో బాధపడుతున్నారా: బొప్పాయితో పేగుల శుభ్రత ఎలా సాధ్యమంటూ వైద్య నిపుణుల వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
మలబద్ధక సమస్య జీర్ణవ్యవస్థను దెబ్బతీసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి బొప్పాయి అద్భుతమైన సహజ నివారణిలా పనిచేస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం స్పష్టం చేసిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. బొప్పాయిలో ఉండే నీటి శాతం, ఫైబర్ పెద్దపేగును శుభ్రపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని, పరగడుపున లేదా రాత్రి వేళల్లో దీనిని తీసుకోవడం ద్వారా వ్యర్థాలు సులభంగా బయటకు పోయి జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు పేర్కొన్నారు.