ఓట్ల తొలగింపుపై కేంద్రం తీరు దారుణం: ఈసీ జ్ఞానేష్ కుమార్ను బర్తరఫ్ చేయాలి
రిపోర్టర్: BALUGURI VENKAHTAREDDY
స్థలం: వలిగొండ
భారతదేశంలో ఎస్ఐఆర్ పేరిట దాదాపు పదమూడు కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కవిడే సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని కేంద్ర పాలక ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు. నిబంధనలను మార్చి విపక్షాల ఓట్లను తీసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.