తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు ఏపీ వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, గరిష్టంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుతో పాటు పలు జిల్లాల్ లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.