రెండు గంటల్లోనే బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ పరీక్ష
రిపోర్టర్: రాజేష్
స్థలం: నాటింగ్‌హామ్
బ్రెయిన్ ట్యూమర్ ఏ రకానికి చెందిందో, ఏ దశలో ఉందో కేవలం రెండు గంటల్లోనే తెలుసుకునే కొత్త పరీక్షను అభివృద్ధి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ పరిశోధకులు వెల్లడించారు. ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఉపయోగిస్తున్న ఈ నూతన సాంకేతికత ద్వారా శస్త్రచికిత్స సమయంలోనే కణితి కణజాలాన్ని విశ్లేషించడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు తెలిపారు. నానోపోర్ సీక్వెన్సింగ్ విధానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ సరికొత్త వ్యవస్థ రోగులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేశారు.