ఏపీలో మరో 21 కొత్త పోషకాహార పునరావాస కేంద్రాలు
రిపోర్టర్: రాము
స్థలం: ఆంధ్రప్రదేశ్
తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. వీటితో రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీల సంఖ్య 41కి, పడకల సంఖ్య 515కి పెరుగుతాయని తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ కేంద్రాల్లో ప్రత్యేక వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నామని, 98 శాతానికి పైగా పిల్లలు కోలుకుంటున్నారని వివరించారు.