చిక్కబల్లాపూర్ లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రాథమిక గణితం మరియు కన్నడ అక్షరాలు నేర్చుకోవడంలో వెనుకబడటంతో 180 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఏడో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు.