వరంగల్ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్ల నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి ప్రయాగ్రాజ్ - తిరునెల్వేలి మధ్య వరంగల్, విజయవాడ మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. అలాగే వివిధ కారణాల రీత్యా ఈ నెల 20న సికింద్రాబాద్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ప్రయాణించే 4 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.