తీవ్ర కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు ఈశ్వర్

రిపోర్టర్: విజయ్ స్థలం: థానే

టెలివిజన్ నటుడు ఈశ్వర్ ఠాకూర్ తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్తో థానేలోని ఆసుపత్రిలో చేరారు. కాలి గాయం కారణంగా ఏర్పడిన ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వ్యాపించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోదరి జయశ్రీ తెలిపారు. 2020 నుంచి ఆయన ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారని, వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని పేర్కొంటూ సాయం కోసం విజ్ఞప్తి చేశారు. కళాకారుడిని ఆదుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.