రైతన్నలకు తీపి కబురు: నేడే ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు జమ
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీ రైతులకు తీపి కబురు అందిస్తూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో మూడు వేల నూట ఇరవై ఐదు కోట్లకు పైగా నిధులు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో నిధులు అందని మిగతా రైతులకూ త్వరలోనే సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.