యువ ఒలింపిక్స్ బరిలో భారత షట్లర్ తన్వి పత్రి సమాయత్తం
రిపోర్టర్: విజయ్
స్థలం: డాకర్
సెనెగల్ లోని డాకర్ వేదికగా జరిగే యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీలకు పదిహేనేళ్ల భారత షట్లర్ తన్వి పత్రి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు ఆమె తండ్రి రబీనారాయణ్ వెల్లడించారు. ఈజిప్ట్ లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ సమయంలో అస్వస్థతకు గురైనప్పటికీ, ప్రస్తుతం ఆమె కోలుకుని టోర్నమెంట్ కోసం సిద్ధమైనట్లు తెలిపారు. డాకర్ లో వేడి వాతావరణం, దోమల బెడదతో పాటు ఏసీ సౌకర్యం లేకపోయినా, మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.