ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రెండో సీజన్ లోకి నటుల ఎంట్రీ

రిపోర్టర్: గోపి స్థలం: చెన్నై

ప్రముఖ తమిళ హారర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి రెండో సీజన్ లో నటుడు ద్రావిడ్ సెల్వమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీపికా వెంకటాచలం నటిస్తున్నట్లు సిరీస్ సృష్టికర్త నందిని జెఎస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు నటీనటుల ఎంపికపై ఆమె స్పందిస్తూ, వారి ప్రతిభను కొనియాడారు. నవైన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పై ప్రేక్షకుల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.