బీహార్లో ఆర్మీ జవాన్ సజీవ దహనంపై గ్రామస్తుల నిరసన
రిపోర్టర్: మహేష్
స్థలం: Bihar
బీహార్లోని కైమూర్ జిల్లా రామ్గర్ధ్ పరిధిలో ఆర్థిక లావాదేవీల వివాదంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఆర్మీ జవాన్ శత్రుధన్ యాదవ్ లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. జవాన్ మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం రామ్గర్ధ్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ దుర్గా చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎస్హెచ్ఓ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎస్పీ శిఖర్ చౌదరి హామీ ఇవ్వడంతో ఐదు గంటల తర్వాత ఆందోళన విరమించారు.