బలిజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: రాచమల్లుపై బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఫైర్

రిపోర్టర్: sankar p స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బలిజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు కుల రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు.