ప్రవాసాంధ్రులతో టీడీపీ అనుబంధం మరింత బలోపేతం: మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Undavalli

రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు అత్యంత కీలక భాగస్వాములని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ పిల్లి గురురాజాతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీల ఏర్పాటును, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి జూమ్ సమావేశాలు నిర్వహించి ప్రవాసుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.