చెత్త నియంత్రణకు వినూత్న ఆలోచన.. దేవుడి ఫ్లెక్సీల ఏర్పాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జయంతినగర్ కాలనీలో యువకులు చెత్త సమస్యకు వినూత్నంగా అడ్డుకట్ట వేశారు. రోడ్లపై ఇష్టానుసారంగా వ్యర్థాలు పడేస్తున్న ప్రాంతాలను శుభ్రం చేసి వివిధ దేవుళ్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుడి, ఇళ్లు ఉన్నందున చెత్త వేయరాదంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. యువకుల ఈ ఆలోచనను స్థానికులు అభినందిస్తున్నారు.