హర్మూజ్ జలసంధిలో ఘోర ప్రమాదం: సముద్రంలో తేలియాడిన ఐఫోన్లు
రిపోర్టర్: శివ
స్థలం: హర్మూజ్ జలసంధి
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో సముద్ర గనిని ఢీకొని ఓ కార్గో నౌక మునిగిపోయినట్లు సింగపూర్ సముద్ర, ఓడరేవు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో నౌకలోని విలువైన ఐఫోన్లు, ఖరీదైన వస్తువులు నీటిలో తేలియాడగా, స్థానికులు వాటిని ఏరుకున్నారు. దుబాయ్ నుంచి వస్తువులను తరలిస్తున్న ఈ నౌకలో మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బంది ఉండగా, వారిని సకాలంలో రక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు.